దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్‌సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ తెలుగు డ్రామాను హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేశ్ పాటిల్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 13న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటిం చిం ది. ఆమె చెప్పిన ‘ఉత్సవం’ మూవీ విశేషాలివీ...
* డైరెక్టర్ అర్జున్‌సాయి ఈ క థ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటీఫుల్‌గా అనిపించింది. నాటక రంగం గురించి ఆయ న చాలా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. సందేశాత్మక చిత్రం కాదు.. కమర్షియల్ ఎ లిమెంట్స్ అన్నీ ఉన్న రూటె డ్ స్టొరీ ఇది. అదే నాకు చా లా నచ్చింది. చాలా అద్భుతమైన నటులు ఇందులో ఉ న్నారు. దిలీప్ చాలా పాజిటి వ్ సోల్. తనతో వర్క్ చేయ డం చాలా ఎంజాయ్ చేశా ను. -ప్రకాశ్‌రాజ్, నాజర్ థి యేటర్స్ నుంచే వచ్చారు. వా రి నుంచి చాలా నేర్చుకున్నా. డీవోపీగా రసూల్, మ్యూజిక్ అనూప్ రూబెన్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.
* ఇందులో నేను కార్పొరేట్ ఎంప్లాయ్‌గా కనిపిస్తా. తనకు లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ ఉండదు.. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ ఉమెన్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. -నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్‌లో ప్లేస్ చేశా. -ఈ సినిమాలో రంగస్థలం నటులు గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి.
* నా ఫస్ట్ సినిమా ‘ఎస్ఎంఎస్’ చేసినప్పుడే వెర్సటైల్ యాక్టర్‌గా ఉండాలని భావించా. అది నా నుంచి ఎప్పుడూ దూరం కాకుండా ఇన్నాళ్లూ పాత్రలు చే సుకుంటూ వచ్చా. నేను చేయగల అన్ని రకాల పాత్రలూ చేయడమే నా గోల్. ప్రస్తుతం గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ సినిమా చేస్తున్నా. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్టులున్నాయి.