calender_icon.png 23 March, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్టరీ థ్రిల్లర్‌లో భూతవైద్యుడిగా..

19-03-2025 12:00:00 AM

సుశాంత్ అనుమోలు తన ప్రాజెక్టులతో చాలా సెలెక్టివ్‌గా ఉన్నారు. తన 10వ మూవీని పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు సుశాంత్. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో సుశాంత్ రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పోస్టర్‌పై భాగంలో అతను స్టులిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. ఇది హీరో క్యారెక్టర్ మరో కోణాన్ని ప్రెజెం ట్ చేస్తోంది. ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో సుశాంత్ ఎక్సర్సిస్ట్ (భూత వైద్యుడు) పాత్రను పోషిస్తాన్నా రు. తెలుగులో ఇలాంటి మూవీ ఇదే తొలిసారి. పృథ్వీరాజ్ చిట్టేటి రచన, దర్శకత్వంలో సంజీవని క్రియేషన్స్ బ్యానర్‌పై వరుణ్‌కుమార్, రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.