07-02-2025 12:49:21 AM
హైకోర్టు న్యాయమూర్తి తుకారాంజీకి విన్నపాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలుసుకుని పూలగుచ్ఛం అందజేసి రెండు పేజీల వినతిపత్రం అందజేసినట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు.
సీనియర్ న్యాయమూర్తి గా తమ అనుభవంతో జిల్లాకోర్టు లోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన వివరించారు. జిల్లాకోర్టు లో ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయాలని, ఓల్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు కేటాయించే విదంగా చొరవ చూపాలని కోరినట్లు జగన్ తెలిపారు.
హైకోర్టు ప్రాంగణంలోనే గల అడ్వొకేట్ జనరక్ సుదర్శన్ రెడ్డిని, అదనపు గవర్నమెంట్ ప్లీడర్ మహేష్ రాజ్ లను మర్యాద పూర్వకంగా కలిసి నిజామాబాద్ బార్ అసోసియేషన్‌ను సందర్శించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.