calender_icon.png 2 October, 2024 | 10:01 AM

తమ్ముడిగా అక్కకు అండగా ఉంటా..

02-10-2024 01:25:19 AM

మంత్రి కొండా సురేఖకు ఎంపీ రఘునందన్‌రావు భరోసా 

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాం తి): కొండా సురేఖ అక్కకు తమ్ముడిగా అండ గా ఉంటానని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు తప్పవని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. మంగళవా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

మంత్రి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశారని, అక్క కు, చెల్లికి, తల్లికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించలేని సంస్కార హీనస్థితిలో బీఆర్‌ఎస్ సోష ల్ మీడియా ఉందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మెదక్ ఇంచార్జి మంత్రి హోదాలో తొలిసారి వారు దుబ్బాకకు వచ్చారని, దుబ్బాకలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలను తెలిపేందుకు అక్క దండ వేయోచ్చా.. అని అడిగి చేనేత నూలు పోగుల దండను వేసిన ట్టు తెలిపారు.

ఒక అక్కకు తమ్ముడిగా ఆమె మెడలో నూలు పోగుల దండ వేస్తే సంస్కా ర హీనంగా పోస్టులు పెట్టడం బాధకరమని ఆగ్రహించారు. ఓ తమ్ముడిగా వారికి జరిగిన ఇబ్బందికి విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అక్కకు జరి గిన అన్యాయానికి ఒక తమ్ముడిగా అండగా ఉంటానని, ఒక వకీలుగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తానని స్పష్టంచేశారు.

ఈ పోస్ట్ పెట్టిన వారు కేసీఆర్, హరీశ్‌రావుల ఫొటోలు డీపీలుగా పెట్టుకున్నారని, కింద కామెంట్లు చేసిన వారు కూడా ఎక్కవ మంది హరీశ్‌రావు డీపీలు పెట్టుకున్నవారేనని తెలిపారు. నిజంగా హరీశ్‌రావుకు చిత్తశుద్ధి ఉం టే.. ఇందులో ఆయన ప్రమేయం లేకపోతే, ఇది చేసిన వారిని తీసుకొచ్చి పోలీ స్‌స్టేష న్‌లో అప్పగించాలని, లేదంటే తన ఫొటో వాడుకొని దుష్ర్పచారం చేస్తున్నారని ఫిర్యా దు చేయాలని చెప్పారు.

సిరిసిల్లలో నేతన్న లు ఎక్కువగా ఉంటారని, బీఆర్‌ఎస్.. నేతన్నలకు చెందిన మహిళని అవమానించిందని, కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు నేతన్నలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.