calender_icon.png 18 October, 2024 | 9:44 PM

హనుమ పాదముద్రల సాక్షిగా..

18-10-2024 12:00:00 AM

కొలువుదీరిన కొప్పూరు అంజన్న :

సాక్షాత్తు హనుమంతుని పాదముద్రలు గల పవిత్ర ప్రదేశంలోనే  భారీ ఎత్తున ‘పంచముఖ ఆంజనేయ స్వామి’ విగ్రహం వెలసింది. ఇక, ఆ దేవాలయం అశేష భక్తజనులను ఆకట్టుకోకుండా ఉంటుందా? ‘వరంగల్-సిద్దిపేట’ రహదారిలో పిల్లలను, పెద్దలను అమితంగా ఆకర్షిస్తున్న ‘కొప్పూరు అంజన్న’ దర్శ నం నిజంగానే ‘కొలిచిన వారికి కొంగు బంగారమే’ అవుతున్నది.

హనుమకొం డ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ శివారులోని ఒక పెద్ద కొండపై వెలసిం దే ఈ ఆంజనేయ స్వామివారి ఆలయం. మహిమాణ్విత పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న ఈ పంచముఖి అంజన్న గుడి ‘మినీ కొండగట్టు’గానూ ప్రసిద్ధి చెందింది. స్వామివారివిగా చెబు తున్న ‘పాదముద్రలు’ ఇక్కడ ప్రత్యేకం. పూర్వకాలంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామియే ఈ గ్రామ శివారులోని గద్దలబండపై కాలు మోపినట్లు స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. 

65 అడుగుల పంచముఖ విగ్రహం

గత ఐదు దశాబ్దాలుగా కొప్పూర్ గద్ద వంశస్థులు ఆంజనేయ స్వామి పాదాలవద్ద ప్రతి యేడు శ్రావణమాసం మొత్తం కుంపటి ఏర్పా టు చేసి, నిత్య దీపారాధన చేస్తున్నారు. ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉండడంతో ఎల్క తుర్తి మండలం జీల్గులకు చెందిన కాసం రమే శ్ గుప్తా 2007లో దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

2024 వరకు సుమా రు రూ. ఒక కోటీ 10 లక్షల వ్యయంతో ఆలయంతోపాటు ప్రాంగణంలోనే ‘పంచముఖ ఆంజనేయ స్వామి’ వారి 65 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.  

భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం, శనివారం ఆలయం వద్ద నిత్యాన్న దానానికి ఏర్పా ట్లు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు రమేశ్ గుప్తా వెల్లడించారు. శ్రీ కమలానంద భారతి స్వామి, శ్రీ పరిపూర్ణానంద స్వామి, తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రభృతులు ఆలయాన్ని సందర్శించారు. 

శతచండీ యాగం నిర్విఘ్నంగా జరిగింది. హనుమాన్ జయంతి వేళ భక్తులు అనూహ్య సంఖ్యలో ఈ కొండపై మాలలు వేసుకుంటారు. ఇక్కడ గోశాల నిర్వహణకు, అర్చకులకు వేతనం, ఇతర సిబ్బంది నివాసానికి కావలసిన సౌకర్యాలు నెలకొల్పారు. 

డిసెంబర్ 8న వినూత్న నృత్య ప్రదర్శన

హనుమాన్ చాలీసా పటిస్తూ మొత్తం 1,515 మంది మహిళలతో వచ్చే డిసెంబరు 8న అసాధారణ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ‘గిన్నెస్ బుక్’ రికార్డు లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకుగాను ములుగుకు చెందిన ‘శ్వేత డ్యా న్స్’ బృందం వారితో మహిళలకు మహిళలకు 3 నెలలపాటు శిక్షణ ఇప్పిస్తున్నారు.

మహిళలంతా ఒకే రకమైన డ్రెస్ కోడ్‌తో నృత్య ప్రద ర్శన ఉంటుందని ఆలయ వ్యవస్థాకులు తెలిపారు. కాగా, ఇక్కడి హనుమత్‌పురి కొండ చుట్టూ భక్తులు ‘గిరి ప్రదక్షిణ’ సౌకర్యవంతంగా చేసుకొనేందుకుగాను అవసరమైన సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ ఇటీవల హామీ ఇచ్చారు.  

 బాలాజీ

విజయక్రాంతి, భీమదేవరపల్లి