16-02-2025 12:00:00 AM
హిందువులంతా గర్వించదగ్గ మ హాయోధుల లో ఛతప్రతి శివా జీ మహారాజ్ ఒకరు. అత్యం త ధైర్యవంతుడు, ప్రగతిశీలుడు, హేతుబద్ధమైన రాజుగా ఆయనకు చరిత్రలో ఎంతో గొప్ప పేరుంది. స్వరా జ్యం, మరాఠా వారసత్వాలను శ్వాసించి, వాటికోసమే కడదాక పాటుపడ్డాడు.
పశ్చిమ భారతదేశంలో ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యానికి యావత్ భారత ఉపఖండంలోనే ప్రత్యే క స్థానం ఉంది. అద్భుత సైనిక యుద్ధ వ్యూహా లు, దృఢ సంకల్పం, పరిపాలనా నైపుణ్యాలకు పెట్టింది పేరు శివాజీ.
మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధరంగంలో వినూత్న వ్యూహాలను పన్నడం లో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేంత గాంభీర్యంతో అలా ఆయన నడిచి వస్తుంటే విజయగర్వంతో నేలతల్లి పరవశించిపోయేది.
క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19న పూణేకు చెందిన జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో షాహాజీ భోంస్లే, జిజియా బాయి దంపతులకు శివాజీ జన్మించాడు. తండ్రి పూణేలోని జాగీర్లతో కూడిన మరాఠా కమాండర్. బీజాపూర్, అహ్మద్‌న గర్, గోల్కొండల త్రైపాక్షిక సంఘమైన బీజాపూర్ సుల్తానేట్‌కు జనరల్‌గానూ ఆయన పనిచే శాడు.
తల్లి జిజియాబాయి అంకితభావం, మత విశ్వాసం ఆయనలో దైవ విశ్వాసాన్ని, అపారమైన దేశ భక్తిని పాదుకొల్పాయి. ఆమె ప్రభా వం ఆయనపై ఎంతో. కారణం, ఎప్పుడూ ఆమె కు దగ్గరగానే ఉండేవాడు.
శివాజీ తన మొత్తం జీవితంలో ఎక్కువ కాలం పూణేలో గడిపాడు. ఆయనలో జన్మతః నాయకత్వ లక్షణాలు పుష్క లం. 15 ఏండ్ల వయస్సులో మావల్ జిల్లా నుం డి ఒక విశ్వాసపాత్రమైన సమూహాన్ని నిర్మించడం ద్వారా తానేంటో నిరూపించుకు న్నాడు.
పరమత సహనం ప్రశంసనీయం
1674లో రాయఘడ్ కోటలో తన రాజ్యానికి పాలకుడు అయ్యాడు. భోంస్లే మరాఠా వంశానికి చెందిన వాడు శివాజీ. భారత నావికాదళ పితామహుడిగానూ ఆయన ప్రసిద్ధి చెందాడు. మహారాష్ట్ర తీరప్రాంత కోటలను రక్షించడానికి నావికాదళాన్ని నిర్మించడంలోగల ప్రాముఖ్యతను గ్రహించాడు.
దీనితోపాటు మహిళలపై హింస, వేధింపులు, అగౌరవ భావనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన పాలనలో మహిళల హక్కులను ఉల్లంఘించే వారు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా శిక్షకు గురయ్యేవారు. శివాజీ పరమభక్తుడు. హిందువు అయినప్పటికీ పరమత సహనాన్ని ప్రదర్శించాడు.
పరులనుంచి తన మతాన్ని కాపాడుకుంటూనే ఇస్లాం, క్రైస్తవ మతాల వారితోసహా అన్ని విశ్వాసాలపట్ల గౌర వం చూపించాడు. అతను ముస్లింలను సైతం త న సేనలోకి స్వాగతించడం విశేషం. వారి ప్రార్థ నా స్థలాలను సంరక్షించాడు. శివాజీ దక్షిణాదిలో ఒక ముఖ్యమైన ప్రచారానికి నాయకత్వం వహించాడు.
మొఘల్ విస్తరణను ఆపడానికి కూటములను ఏర్పరచుకు న్నాడు. 1645 నాటి కి, శివాజీ మరాఠా సామ్రాజ్యం టోర్నా, చకన్, కొండోనా, సింఘాగఢ్, పురందర్‌లతోసహా బీజాపూర్ రాజవంశం నుండి పూణే పరిసరాల్లోని అనేక ప్రధాన ప్రాంతాలకు విస్తరించింది. ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఆయనది.
1674 జూన్ 6న రాయఘడ్ కోటల వేదమంత్రాల మధ్య పండితులు శివాజీని ‘క్షత్రియ రాజులందరికీ అధిపతి’గా కీర్తిస్తూ ‘ఛత్రపతి’ బిరుదును ప్రదానం చేశారు.
సుమారు 27 ఏళ్లపాటు యుద్ధాలతో గడిపి, సువిశాలమైన మరా ఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ప్రజలపట్ల అంతులేని వాత్సల్యాన్ని కురిపిం చిన ధన్యజీవి. హిం దూ రాజులకు ఎంతో ఆదర్శంగా నిలిచిన గొప్ప చక్రవర్తిగానూ ఆయనను చరిత్ర గుర్తుంచు కుంది. అస్వస్థత కారణంగా 1680 ఏప్రిల్ 3న రాయఘడ్‌లో శివాజీ చివరి శ్వాస విడిచాడు.