calender_icon.png 22 October, 2024 | 11:08 PM

జాలర్ల వెతలే కథగా..

22-10-2024 12:00:00 AM

రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సముద్రుడు’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బదావత్ కిషన్ నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో సుమన్ ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు వీ సముద్ర, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టీ ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.