calender_icon.png 31 October, 2024 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమకు గుర్తుగా..

28-06-2024 12:05:00 AM

బాలీవుడ్ జంట ప్రిన్స్ నరులా చౌదరి.. బిగ్‌బాస్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2018, జవవరిలో నిశ్చితార్థం.. అదే ఏడాది అక్టోబర్‌లో పెళ్లి ఇలా చకచకా జరిగిపోయాయి. ఈ జంట మరో శుభవార్తను తెలిపింది. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తాజాగా సోషల్ మీడి యా వేదికగా ప్రకటించింది యువికా చౌదరి. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని పంచుకుంటూ.. ‘మా జీవితాల్లోకి త్వరలో బేబీ రాబోతోంది’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. మరోవైపు ‘నా భార్య నుంచి అందుకునే ఉత్తమ కానుక ఇదే’ అంటూ ప్రిన్స్ నరు లా ఆనందాన్ని వెల్లడిస్తూ యువికాకు థ్యాంక్స్ చెప్పాడు. వీరి వృత్తిపరమైన విషయాలకొస్తే.. యువికా చౌదరి ‘ఓం శాంతి ఓం’, ‘నాటీ@40’, ‘వీరే కీ వెడ్డిం గ్’, ‘ఎప్‌పీ చౌహాన్’, ‘ద పవర్’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రిన్స్ నరులాది రియాలిటీ షోల్లో టాలెంట్ ప్రదర్శించేవాడు. 2019 లో ‘నాచ్ బలియే’ అనే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని గెలిచారీ దంపతులు.