15-04-2025 12:06:24 AM
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న తాజాచిత్రం ‘దండోరా’. ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్నారు. శివాజీ, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిం చుకున్న బిందు మాధవి ఈ సినిమాలో భాగమయ్యారు.
ఇందులో ఆమె వేశ్య పాత్ర లో నటిస్తున్నారు. భావోద్వేగంతో కూడిన ఆమె పాత్ర ఆలోచింపజేస్తుందని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో బిందుమాధవి పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట ఆర్ శాఖమూరి; సంగీతం: మార్క్ ఆర్ రాబిన్; ఆర్ట్: క్రాంతి ప్రియం; ఎడిటర్: సృజన అడుసుమిల్లి.