calender_icon.png 15 January, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహాయ మంత్రిగా.. కాదు కాదు ..మంత్రిగా

09-07-2024 02:26:40 AM

రాష్ట్ర మంత్రికి బదులు.. సహాయ మంత్రిగా అని ఉచ్ఛారణ

మధ్యప్రదేశ్, జూలై 8 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్‌నివాస్ రావత్ ఇటీవల అధికార బీజేపీలో చేరగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేబినేట్‌లో చోటు కల్పించింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో సోమవారం ఆయన ప్రమాణ స్వీకా రం సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. గ వర్నర్ మంగుభాయ్ సమక్షంలో రావత్ ప్రమాణ స్వీకారం చేస్తూ.. రాష్ట్ర మంత్రికి బదులుగా.. రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని తప్పుగా ఉచ్ఛరించారు. ఈ విషయం అక్కడ గందరగోళానికి తెరలేవడంతో చీఫ్ మినిస్టర్ యాదవ్ సూచన మేరకు గవర్నర్ మంగుభాయ్.. రావత్‌తో మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి..

మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎ మ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత రామ్‌నివాస్ రావత్ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి రా్రష్ట్రంలోని సీఎం యాదవ్ ఆధ్యర్యంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించింది. ప్రస్తుతం ఆయనతో కలిపి రాష్ట్రంలోని కేబినేట్ మంత్రుల సంఖ్య 32కి చేరింది.