31-03-2025 12:05:22 AM
‘సిరా’ అనే లఘుచిత్రంతోపాటు ‘మిథునం’ వంటి క్లాసికల్ సినిమాతో తనను దర్శకుడిగానూ నిరూపించుకున్నారు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘మిథునం’ అప్పట్లో ప్రేక్షక హృదయాలను హత్తుకుంది.
అంతేనా, ఉత్తమ మాటల రచయిత (తనికెళ్ల భరణి) సహా నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు భరణి. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారాయన. 20 మధ్య వయసున్న యువతతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని.. ప్రస్తుతం హీరోహీరోయిన్ సహా ఇతర పాత్రధారులను ఎంపిక చేసే పనిలో ఉన్నామని తెలిపారు.