calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

38 ఏళ్ల తర్వాత జంటగా..

13-04-2025 12:00:00 AM

‘ఎల్2 ఎంపురాన్’తో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్లు రాబట్టి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ స్టార్ మోహన్‌లాల్. ఇప్పుడాయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘తుడరుమ్’. ఈ సినిమాకు మలయాళ పాపులర్ డైరెక్టర్, ‘ఆపరేషన్ జీవా’ ఫేమ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎం రెంజిత్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

క్రైమ్ కామెడీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయన కారు అనూహ్యంగా ఒక సమస్యలో ఇరుక్కోవడం.. మోహన్‌లాల్ ఆ కారును వదిలిపెట్టి ఒక్కక్షణం కూడా ఎందుకు ఉండలేడు అనేదే ఈ సినిమా. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తుండటం! మోహన్‌లాల్‌తో ఆమె ఇప్పటివరకు 55 సినిమాల్లో నటించారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజాచిత్రం 56వది కావడమే ఆసక్తికరం. శోభన చివరిసారిగా 1987లో మోహన్‌లాల్‌తో నటించారు. దాదాపు 38 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో జత కడుతుండటం విశేషం.