calender_icon.png 5 February, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫౌజీలో బ్రాహ్మణ యువకుడిగా..

21-01-2025 01:51:50 AM

ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఫౌజీ’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కథ, కథానాయకుడిగా పాత్ర గురించి కొన్ని విశేషాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రభాస్ ఇందులో బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్ టాక్.

ఈ సినిమా మధురై ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగనుందట. బౌద్ధ సంప్రదాయాలకు ప్రసిద్ధిచెందిన కరైకుడి ప్రాంతంలోని దేవిపురం అగ్రహారంలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసుకుందని వినికిడి. ఈ అగ్రహారంలో 20 రోజుల పాటు షూటింగ్ జరగనుందని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ సరసన ఇమాన్వి తొలిసారి నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది చిత్రబృందం. 

అజీజ్‌నగర్‌లో ‘రాజాసాబ్’ సందడి

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతీ హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కథానాయకలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది.

దాదాపు వారం రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరుగుతుందని సమాచారం. రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ యూరప్‌లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సెట్‌లో అడుగుపెట్టనున్నారు. ఈలోగా ప్రభాస్ లేకుండానే కొన్ని షాట్స్, ఛేజ్‌లు చిత్రీకరిస్తున్నారు.  మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మాళవిక మోహన్ ఫైట్ సీన్ ఒకటి లీక్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.