calender_icon.png 19 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు సంఘటితం కావాలి

14-03-2025 12:00:00 AM

  1. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్
  2. ఘనంగా ఆర్యవైశ్య మహాసభ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

బచ్చన్నపేట, మార్చి 13: ఆర్యవైశ్యులు సంఘటితంగా ముందుకు నడవాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు. బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొ డవటూరు సిద్ధలగుట్ట శ్రీ వాసవి నిత్యాన్న సత్రంలో బుధవారం జిల్లా బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన బచ్చన్న పేట మండల ఆర్య వైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

అంతకు ముందు  ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షులు కొ త్తపల్లి రాజయ్య, ప్రధాన కార్యదర్శి పులిగిల్ల కనకయ్య, కోశాధికారి కాపర్తి హరిప్రసాద్, ముఖ్య సలహాదారులు జిల్లా బుచ్చయ్య,, గందె బాలకిషన్, జిల్లా శివకుమార్, పులిగిల్ల అంజయ్య, రామిని మదన్, శర్విరాల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు పిన్నా సురేందర్, పులిగిల్ల పూర్ణచందర్, పుసనాల రమేష్, బుస్సా ఉప్పలయ్య, జిల్లా రాజేశ్వర్,  వీరమల్లయ్య, సహాయ కార్యదర్శి మొగులపల్లి వెంకన్న, దొంతుల అజయ్, దొంతుల రాజు, కొత్త శ్రీనివాస్, గౌతు సంతోష్, కందుకూరి శ్రీనివాస్, ఓరుగంటి వెంకటేశం, కాపర్తి జగదీశ్వర్, జిల్లా హరి కిషన్ తో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులచే ప్రమా ణ స్వీకారం చేయించారు.

అనంతరం ప్రమోద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత మన అభివృద్ధికి దోహదపడు తుందన్నారు. జిల్లాలో ఆర్యవైశ్య కుటుంబాల కు అండగా ఉంటామని, సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృతం చేస్తామన్నారు. ప్రస్తుత నూతన మండల కమిటీ చురుకుగా పనిచేస్తూ మన ఉన్నతికి బాటలు వేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు జిల్లా రాజేశ్వర్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం బిక్షపతి, లయన్ రీజియన్ చైర్మన్ పడకండి రవీందర్, జోన్ చైర్మన్ మాశెట్టి వేణుగోపాల్, వాసవి ఉపాసకులు తెలంగాణ ధార్మిక సంస్థ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజ య్య స్వామి, జనగామ, సిద్దిపేట జిల్లా లకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు వంగపల్లి వెంకటేశం, దొంతుల చంద్రమౌళి,  తడక లింగం, పోకల లింగ య్య,, పజ్జురి జయహరి, మహంకాళి హరిచంద్ర గుప్తా, కొత్తపల్లి కాశీపతి ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.