24-02-2025 12:32:24 AM
కోదాడ ఫిబ్రవరి 23: ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్ర భాగాన నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ పదవుల నియామకం కొరకు ఆర్యవైశ్య సంఘం కోదాడ పట్టణ అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
కోదాడ పట్టణ అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు, కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, సంయుక్త కార్యదర్శి అశోక్, యూత్ అధ్యక్షుడు బొమ్మిడి అశోక్, మాజీ అధ్యక్షుడు అనంత రాములు, మాజీ కార్యదర్శి బండారు రాజా, కుక్కడపు బాబు, సత్యనారాయణ, జగని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు