calender_icon.png 12 October, 2024 | 6:48 PM

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్, కార్యవర్గం రాజీనామా

03-09-2024 11:35:48 AM

జిల్లా అధ్యక్షులు నల్మాస్ ప్రభాకర్

పెద్దపల్లి,(విజయక్రాంతి): మంథని పట్టణం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్, కార్యవర్గం రాజీనామా చేశారని  జిల్లా అధ్యక్షులు నల్మాస్ ప్రభాకర్ తెలిపారు.  రాజీనామా పత్రాన్ని గతంలో మాజీ జిల్లా  అధ్యక్షునికి వాట్సప్ ద్వారా పంపించారని, కానీ అ రాజీనామాను వారు ఇప్పటివరకు ఆమోదింప చేసుకోలేదన్నారు. నూతనంగా  బాధ్యతలు తీసుకున్నక తమ కార్యవర్గం మంథని పట్టణం కళ్యాణ మండపంలో మహాసభ కార్యదర్శి కొమురవెల్లి విజయ్ కుమార్ అధ్యక్షతన  జరిగిన  సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మంథని పట్టణ కార్యవర్గాన్ని వారి విన్నపం మేరకు ఆమోదించనైంది.

ఆమోదించిన రాజీనామాను రాష్ట్ర మహాసభకు పంపించి, త్వరలోనే ఎన్నికలు నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు ఓల్లాల సత్యనారాయణ,  ముస్త్యాలదామోదర్, కొత్త శ్రీనివాస్, ఎల్లంకి వంశీ, ఒల్లాల నాగరాజు, రావికంటి మనోహర్, చందా ఈశ్వర్, రాచర్ల నాగరాజు, బజ్జురి ప్రవీణ్, కొమురవెల్లి రాజు, ఎల్లంకి కేదారి, కొమురవెల్లి దత్తు, రావికంటి చందు, మణికంఠ ప్రకాష్, దొంతుల మేఘశ్యామ్, కొమురవెల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.