27-04-2025 09:53:44 PM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్య సమాజ్ 50 వసంతాల స్వర్ణోత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Kamareddy MLA Katipally Venkataramana Reddy) అన్నారు. సరస్వతి శిశు మందిర్ ఆవరణలో జరిగిన ఆర్య సమాజ 50 వసంతాల స్వర్ణోత్సవం కార్యక్రమంతో పాటు 108 అష్టోత్తర మహా చండీయాగం కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి ఆర్య సమాజ్ వారి ఆహ్వానం మేరకు స్థానిక శిశుమందిర్ లో జరిగిన కామారెడ్డి ఆర్యసమాజ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం, అష్టోత్తర(108) శత కుండీయ గాయత్రి మహా యాగంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. కామారెడ్డి ఆర్యసమాజ స్వర్ణోత్సవ సంచిక-2025 పుస్తకాన్ని ఆవిష్కరించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డితో పాటు ఆర్య సమాజం ప్రతినిధులు పైడి రామ్ రెడ్డి, సిద్దా గౌడ్, రఘు కుమార్, బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.