calender_icon.png 14 November, 2024 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనను ఎందుకు జైలుకు పంపారో చెప్పిన కేజ్రీవాల్‌

15-09-2024 01:32:20 PM

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను ముక్కలు చేసేందుకే తనను జైలుకు పంపారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ లో చీలిక తెచ్చి ఢిల్లీ గద్దె ఎక్కాలనుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా ఆప్ ను విచ్చిన్నం చేయలేకపోయారని విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదని తెలిపారు. నెలల తరబడి జైలులో ఉన్నా రాజీనామా చేయలేదని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టే ప్రశ్నించిందని కేజ్రీవాల్ సూచించారు. జైలు నుంచి ప్రభుత్వం నడపవచ్చని సుప్రీంకోర్టు నిరూపించిందన్నారు.  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తన నిజాయితీని ధృవీకరిస్తేనే ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2025 ఫిబ్రవరిలో కాకుండా నవంబర్ 2024లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.