calender_icon.png 10 January, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. రెండ్రోజుల్లో రాజీనామా

15-09-2024 01:19:44 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తన నిజాయితీని ధృవీకరిస్తేనే ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రజల కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఆఫ్ నుంచి మరొకరు సీఎం అవుతారని చెప్పారు. కొత్త సీఎం ఎంపిక కోసం 2,3 రోజుల్లో పార్టీ సమావేశం ఉంటుందన్నారు. తాజాగా ప్రజాతీర్పు కోరతానని, ప్రజలే అంతిమ న్యా నిర్ణేతలని పేర్కొన్నారు. రాజీనామా చేస్తానని ఆప్ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతానని కేజ్రీవాల్ తెలిపారు. తాను నిర్దోషిని అని నమ్మితేనే ఓట్లు వేయడంన్నారు. మహారాష్ట్రతో పాటే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 2025 ఫిబ్రవరిలో కాకుండా నవంబర్ 2024లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.