08-02-2025 01:28:00 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధికారం దిశగా దూసుకుపోతుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానంలో బీజేపీ 34 చోట్ల ఆధిక్యలో ఉండగా.. 17 స్థానంలో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 13 చోట్ల ఆధిక్యంలో కనిపించగా, 6 స్థానల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరాజయం. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ విజయం సాధించారు.
కాల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి వెనుకంజలోనే ఉన్న ఆతిశీ సింగ్ చివరి రౌండ్లలో పుంజకొని నెగ్గారు. కొండ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమర్ బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్ పై 6,293 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఢిల్లీ కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థి భువన్ తన్వర్ పై ఆప్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ విజయం సాధించారు. జంగ్ పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోదియా ఓటమి చవిచూశారు. మనీశ్ సిసోదియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం, లక్ష్మీనగర్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి బీబీ త్యాగీపై బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ గెలుపొందారు. పత్పర్ గంజ్ నుంచి ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాపై బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగీ విజయం. త్రీనగర్ లో బీజేపీ అభ్యర్థి తిలక్ రామ్ గుప్తా విజయం సాధించారు. షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ పరాజయం కాగా, బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ 19 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.