న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్‌కు మే 10న సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ పై బయటకు వచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కు వీలుగా ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడింది. జూన్ 2న లొంగిపోవాల్సిందిగా ఆప్ అధినేతను కోర్టు కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ నేతను అరెస్టు చేసింది. మే 7న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా, మధ్యంతర బెయిల్ మంజూరైతే అరవింద్ కేజ్రీవాల్ అధికారిక బాధ్యతలను నిర్వహించకుండా ఉండాలని కోర్టు పేర్కొంది. అదే రోజు, ఢిల్లీ కోర్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.