calender_icon.png 6 October, 2024 | 6:02 PM

జనతా కీ అదాలత్‌లో కేజ్రీవాల్

06-10-2024 03:33:36 PM

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఒక్కొక్కటి ఓడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. మరో ఇంజన్ ఒకదాని తర్వాత ఒకటి.. ఇప్పుడు హరియాణా, జమ్ముకశ్మీర్ లో ఓడిపోతున్నాయన్నారు. ఝార్ఖండ్, మహారాష్ట్ర సహా అనేక డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఓడిపోతున్నాయని జోస్యం చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే.. అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే దేశంలోని బీజేపీ ప్రభుత్వాలన్నీ ఓడిపోతున్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన జనతా కి అదాలత్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ విఫలమైందన్నారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసిందని కేజ్రీవాల్ వెల్లడించారు.