న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ పీఏసీ సమావేశానికి సిసోదియా, రాఘవ్ చద్దా, ఇతర ఆప్ కీలక నేతలు హాజరయ్యారు. రేపు సాయంత్రం కేజ్రీవాల్ ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. లెప్టినెంట్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. నిజాయతీపరులమని ప్రజాకోర్టులో తేలాకే పదవి చేపడతామని ఆయన అన్నారు. ఈ రోజు జరిగిన భేటీలో ఎమ్మెల్యేలతో చర్చించి కొత్త సీఎం పేరును ప్రకటిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.