calender_icon.png 1 November, 2024 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్వింద్‌కు ప్రజాసమస్యలపై అవగాహన లేదు

12-05-2024 02:38:51 AM

విలాసవంతమైన జీవితం కోసమే ఆయన రాజకీయం

ఎంపీగా నిజామాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదు

‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి

నిజామాబాద్, మే 11 (విజయక్రాంతి): ప్రజల సమస్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు అవగాహన లేదని, విలాసవంతమైన జీవితం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అరవింద్‌కు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే మరో ఐదేళ్లు వృథాగా పోతాయనని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్‌లో శనివారం నిర్వహిం చిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. 

తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, అలాగే మంత్రిగా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ఇప్పటికీ నిజామాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల లేవని, కానీ తాను ఇరవై ఏళ్ల క్రితమే జగిత్యాలకు తీసుకువచ్చానని గుర్తుచేశారు. తన హయాంలోనే గుమ్మిర్యాల్ వద్ద గోదావరిపై వంతెన మం జూరు చేయించానన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపడతానన్నారు. నిజామాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నా, ఎంపీ అర్వింద్ నిర్లక్ష్యం కారణంగా స్మార్ట్ సిటీ రాలేదన్నా రు. తాను నిజామాబాద్ జిల్లాకు నాన్‌లోకల్ అన్న విలేకర్ల ప్రశ్నకు ఆయన బదులి చ్చారు. తన సొంత నియోజకవర్గం జగిత్యా ల నిజామాబాద్ పార్లమెంట్ నియోకజవర్గం పరిధిలోకి వస్తుందని, ఆందుకే తాను నిజామాబాద్ నుంచి పోటీకి సిద్ధపడ్డానని స్పష్టం చేశారు. 

తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని మూడు చక్కెర ప్యాక్టరీలను తెరిపిస్తానని, ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేసిందన్నారు. తాను స్వయంగా చొరవ తీసుకుని గల్ఫ్ బాధిఎతులను ఆడుకుంటానని హామీ ఇచ్చారు.