న్యూఢిల్లీ: బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం ప్రకటించింది. అంబుడ్స్‌మన్‌తో పాటు ఎథిక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. 2014 నుంచి 2020 వరకు సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్‌గా విధులు నిర్వర్తించిన అరుణ్ మిశ్రా 2021లో జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024 జూన్ వరకు ఈ పదవిలో ఉన్నారు.