calender_icon.png 8 January, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతోపాటు కళలకూ ప్రాధాన్యమివ్వాలి

02-11-2024 12:54:01 AM

కళాఉత్సవ్‌లో పాఠశాల విద్యాశాఖ 

కమిషనర్ నర్సింహారెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు, సాహిత్య, సాంస్కృతిక కళల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకత అంశాలను వెలికితీయాలంటే ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

అనంతరం నిర్వహించిన పాటల పోటీలో పీ చక్రిక అండ్ టీమ్, నృత్యంలో ఏ యజ్ఞశ్రీ, విజువల్ ఆర్ట్స్‌లో ఎం శ్రీవాత్సవ్ మొదటి బహుమతి సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి 174 విద్యార్థులు హాజరయ్యారు. పోటీల్లో మొదటి బహుమతి వచ్చినవారు జాతీయస్థాయి కళాఉత్సవాల్లో పాల్గొంటారు. సమావేశంలో జేడీ, ఏఎస్పీడీ రాజీవ్, స్టేట్ అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ వెంకటస్వామి, తాజ్ బాబు పాల్గొన్నారు.