13-02-2025 01:59:30 AM
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ సిటీ, ఫిబ్రవరి12 : విద్యార్థులు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ఉపాధ్యాయుల గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళ మేళ, సైన్స్ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ బుధవారం సందర్శించారు.
కస్తూరిబా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు తయారుచేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు అందమైన వస్తువులను స్వతహాగా తయారు చేస్తున్నారని, ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.
ఎంతో కళా నైపుణ్యం బాగుందని, దాన్ని వెలికి తీయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు.