13-03-2025 12:16:53 AM
టేకులపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాదు రవీంద్ర భారతిలో విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో టేకులపల్లి మండలానికి చెందిన తెలంగాణ సంస్కృతిక సారథి సభ్యురాలు అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీలా కళాకారినిగా సంస్కృతిక రంగంలో చురుకైన పాత్ర పోషించింది. నీలా సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృత సారథి విభాగంలో ఆమెకు ఉద్యోగం అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ సంస్కృతిక సారధి విభాగంలో కూడా తన ప్రతిభను చాటుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో నీలది అందవేసినచేయి. స్వేచ్ఛ భారత్, పచ్చదనంపై, సీజన్ వ్యాధులు మరెన్నోఅవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో నీలా చురుకైన పాత్ర పోషిస్తుంది. సంస్కృత రంగంలో ఆమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు రాష్ట్రస్థాయి అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. టేకులపల్లి మండలం, 9వ మైలు తండ గిరిజన గ్రామంలో పుట్టిన నీల అంచలంచలుగా కళా సంస్కృతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడాన్ని అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.