calender_icon.png 20 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిజన్స్‌ను పర్మినెంట్ చేయాలి

20-11-2024 03:54:05 AM

తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ ఈశ్వర్ రావు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 19 (విజయక్రాంతి) : విద్యుత్ శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 20వేల మంది ఆర్టిజన్స్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బాగ్‌లింగంప ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని జిల్లాల జేఏసీ నాయకుల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. 2017లో కాం ట్రాక్ట్ కార్మికులుగా ఉన్న 23,667 మందిలో కొందరు రిటైర్మెంట్ కాగా, మరికొందరు విద్యుత్ ప్రమాదాలలో చనిపోయారని అన్నారు.

రిటైర్ అయిన ఆర్టిజన్ కార్మికుడికి 20 సంవత్సరాలు సర్వీసు చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం రూ.40వేల నుంచి రూ.80వేలు మాత్రమే వస్తుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో ఉన్న 20 వేల మంది ఆర్టిజన్స్‌కు ఉన్న విద్యార్హతను ఆధారంగా వివిధ పోస్టులలో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎంఏ వజీర్, కోచైర్మన్లు బి.శంకర్, వి.నరేందర్, సీహెచ్ యల్లయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు.