calender_icon.png 27 September, 2024 | 4:52 PM

ఢిల్లీలో కృత్రిమ వర్షాలు!

26-09-2024 02:26:22 AM

కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశ రాజధాని ఢిల్లీని శీతకాలంలో వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అక్టోబర్ చివరి నుంచి వాయుకాలుష్యం గరిష్ఠస్థాయికి చేరుతోంది.

చలికాలం నేప థ్యంలో పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు కూడా కనిపించవు. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. నవంబర్‌లో వాయుకాలు ష్యం గరిష్ఠస్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో కృత్రి మ వర్షం కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నవంబర్ 1 నుంచి 15 వరకు రాజధాని ప్రాంతం లో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ బుధవా రం స్పష్టం చేశారు. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ పంపామని వెల్లడించారు. 2016 మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి గోపాల్ తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు.