calender_icon.png 24 February, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ క్లబ్ ద్వారా భద్రాద్రిలో ఆర్టిఫిషియల్ కొలతల క్యాంపు

23-02-2025 10:40:54 PM

భద్రాచలం (విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం, రోటరీ ట్రస్ట్ ఖమ్మం, స్పాన్సర్ ఏకం యుఎస్ఏ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు ఒక కాలు లేక రెండు కాళ్లు కోల్పోయినటువంటి లబ్ధిదారులకు ఉచితముగా ఆర్టిఫిషియల్ ఇవ్వటానికి సంబంధిత కొలతలు తీసుకునే కార్యక్రమం ఆదివారం భద్రాచలంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పసుమర్తి రంగారావు, సుధాకర్ పలివేల భూషణ్ రావులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సుమారుగా 90 మంది లబ్ధిదారులు హాజరవుగా వారి వద్ద నుండి నిపుణులు సంబంధిత కోల్పోయిన కాలు కొలతలు తీసుకోవడం జరిగింది. కొలతలు తీసుకున్న వారికి ఆర్టిఫిషియల్ లిమ్స్ మార్చ్ నెలాఖరులోపు ఆర్టిఫిషియల్ లిమ్స్ అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెన్స్ శ్రీ వీరయ్య, యశోద రాంబాబు, రఫీ గారు జక్కం వేణుగోపాల్ రావు, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ శ్రీమతి నలిని, ప్రస్తుత అధ్యక్షులు బాలాజీ రావు సెక్రటరీ విద్యాసాగర్ ప్రెసెంట్ నామిని అజీమ్ ప్రోగ్రాం చైర్మన్ ఫాస్ట్ ప్రెసెంట్ రఫీ ప్రెసిడెంట్ నామిని అజీమ్ పాస్ట్ సెక్రెటరీ శేషు కుమార్ సభ్యులు చలపతి, రామకృష్ణారెడ్డి, కొత్తా రామకృష్ణ, కోదుమూరు రామకృష్ణ, ప్రసాద్, జకరయ్య, విక్టోరియా వరలక్ష్మి, హరి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.