03-03-2025 04:03:20 PM
నీరుపేద విద్యార్థులకు ఎంతో మేలు
కాళ్లకల్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ ను ప్రారంభించిన డిఈ ఓ రాధాకిషన్...
మనోహరాబాద్,(విజయక్రాంతి): ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో కనీస అభ్యర్థన సామర్థ్యాలను పెంచేల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence Loot Lab) క్లాసులు ఏర్పాటు చేయడం నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా విద్య అధికారి రాధాకిషన్(DEO Radhakishan) సూచించారు. మండలంలోని కాళ్లకల్ ప్రైమరీ స్కూల్(Kallakal Primary School) హెచ్ఎం శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా డిఈఓ రాధాకిషన్, ఎంఈఓ మల్లేశం, బెంగళూరు ప్రతేక సిబ్బందిలు హాజరై ఉపాధ్యాయులతో కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా డీఈవో మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 6 పాఠశాలలను సెలెక్ట్ చేయడం జరిగిందని మనోహరాబాద్ మండలంలో కాళ్లకల్ ప్రాథమిక పాఠశాలను సెలక్ట్ చెయ్యడం జరిగిందని 1నుండి 5 వ తరగతి విద్యార్థులకు 10 కంప్యూటర్ లతో ఏఐ పై ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు చదవటం, రాయటం, లెక్కలు చేయడం పట్ల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చామన్నారు.హెచ్ఎం శ్రావణి రెడ్డి తమ స్వంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు ప్రతేక ప్రతినిధులు ఆనంతి, అకాష్, ప్రీతీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.