12-02-2025 01:59:10 AM
* ఏఐ సమ్మిట్‌లో ప్రధాని
* మోదీకి ఘనస్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
* డీప్‌ఫేక్ సవాళ్లు అధిగమించాలి
పారిస్, ఫిబ్రవరి 11: కృతిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని అనడం సరికాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి సహ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అనేక దేశాలకు చెందిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గొనగా.. వారందరినీ ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
మార్పులు సహజం
‘ఏఐ వల్ల మానవుల రోజువారీ పనుల్లో తప్పక మార్పులు వస్తాయి. ఇప్పటికే మనందరి జీవితాలను కృతిమమేధ ప్రభావితం చే సింది. ఏఐతో ఉద్యోగాలు పోతాయనేది అ పోహ మాత్రమే. ఏఐ ఎవరి ఉద్యోగాలను క బళించదు. ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వివిధ రంగాల్లో కొత్త ఉ ద్యోగాల సృష్టికి అవకాశం ఏర్పడుతుంది.
ఆ అవకాశాలను అందుకోవడానికి మనకు నై పుణ్యాలు అవసరం. నైపుణ్యాల విషయం లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. వివిధ రంగాలను మెరుగుపర్చడం ద్వారా కోట్ల మంది జీవితాలను మార్చడం లో ఏఐ కీలకపాత్ర పోషిస్తుంది’. అన్నారు.
ఆందోళనలు పరిష్కరించాలి
కృతిమ మేధ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అదే సంఖ్యలో సవాళ్లు కూడా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ‘డీప్ ఫేక్స్ ఇప్పుడు మనముందున్న అతిపెద్ద సవాలు. ఈ డీప్ ఫేక్స్ గురించి మానవాళి మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ ఆందోళనలను పరిష్కరించాలి. అందుకోసం ప్ర తిభ ఉన్న సమాజం కలిసి పని చేయాలి. డి జిటల్ మార్కెట్ రంగంలో ఇండియా దూ సుకుపోతుంది. సుపరిపాలన అంటే కేవలం ప్రత్యర్థులను ఎదుర్కోవడం మాత్రమే కాదు’. అని మోదీ పేర్కొన్నారు.
వాన్స్‌తో మోదీ..
ఏఐ సమ్మిట్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, చైనా ఉపాధ్యక్షుడు జాంగ్ హాజరయ్యారు. వాన్స్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియా ప్రపంచాన్ని నడిపిస్తోంది..
భారత్ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఇంధన వార్షికోత్సవాలు 2025 ఎడిషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడుతూ.. ‘21వ శతాబ్ద ం భారత్‌దేనని అనేక మంది నిపుణు లు చె బుతున్నారు. మన దేశ ఇంధన రంగ ం వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మన దేశంలో ఉన్న శిలాజేతర ఇంధనాలను సమర్థవంతంగా వాడుకుంటూ ముందుకు సాగుతున్నాం.
మన శిలాజేతర ఇంధన శక్తి మూడు రెట్లు పెరిగింది. రాబోయే 20 ఏండ్లు ఇండియాకు ఎంతో కీలకం. పారిస్ జీ20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొద టి దేశం భారత్. 2030 నాటికి కర్బన ఉద్గారాల సంఖ్యను సున్నాకు తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నాం. గ్రీన్ హై డ్రోజన్ ఉత్పత్తిపై ఫోకస్ చేశాం. ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్య ంగా పెట్టుకున్నాం’. అని తెలిపారు.