20 వేల మంది కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవద్దు.. ఐఎఫ్టియు నేత జె.సీతారామయ్య..
పాల్వంచ (విజయక్రాంతి): తెలంగాణ ట్రాన్స్కో జెన్కో డిస్కంలో పనిచేస్తున్న 20వేల మంది ఆర్టిజన్స్ కార్మికులను కన్వర్షన్ చేయాలని పాల్వంచలో కేటీపీఎస్ సెంటర్ లో మూడు రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల దీక్ష శిబిరాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ.ఎఫ్.టి.యు జిల్లా బృందం పాల్గొని మద్దతు గురువారం తెలియజేశారు. అనంతరం భారత కార్మిక సంఘాల సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే సీతారామయ్య మాట్లాడుతూ... స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఆర్టిజన్ కు ఇంక్రిమెంట్ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలని కానీ ఇంతవరకు ఇవ్వలేదని హామీ ఇచ్చిన పెద్ద సంఘాల నాయకుల ఇంతవరకు ఎందుకు ఇప్పించ లేకపోయారో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ సమస్యలపై గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చిన పది రోజుల్లోనే పర్మినెంట్ చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చి ఈ రోజుకు కనీసం ఆ ఫైలు కనీసం పట్టించుకోవడంలేదని వారన్నారు.
గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తు అనేక ఆందోళన చేస్తున్న రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తుందని వారు అన్నారు. సంస్థ కోసం ప్రాణాలు కోల్పోతున్నది ఆర్టిజన్ కార్మికులనని అందుకే విద్య అర్హతలను బట్టి జేఎల్ఎం, జెపిఏ, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్ ఆఫీస్ సవార్డినేటర్ తో పాటు చదువుకు తగ్గ పోస్టులు ఇవ్వాలని వారు అన్నారు. 20000 మంది ఆర్టిజన్ కార్మికులని కన్వర్షన్ చేయడం వల్ల విద్యుత్ సంస్థపైన గాని రాష్ట్ర ప్రభుత్వంపైన గాని ఎలాంటి ఆర్థిక భారం పడదని వారు అన్నారు. ఒకే సంస్థల రెండు రకాల సర్వీసు రూల్స్ ఉండడం కూడా సరైనది కాదని దీన్ని వెంటనే మార్చాలని వారు అన్నారు. విద్యుత్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల డిమాండ్స్ న్యాయమైనవి అని వాటిని రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించి ఆర్టిజన్ కార్మికుల్ని కన్వర్షన్ చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఇది చేయడం లేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గౌని నాగేశ్వరరావు, భవన నిర్మాణ జిల్లా అధ్యక్షులు ఎర్నం శ్రీను, పాల్వంచ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ భాస్కర్ కె.నరసింహారావు, కృష్ణ, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.