20-03-2025 12:06:08 AM
తేలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెం ట్ అసోసియేషన్ నూత న కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొనగా, డైరెక్టర్లు హరీశ్‌శంకర్, మారుతి, వైవీఎస్ చౌదరి అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా కేఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇతర పాలక సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్యతల గురించి ఆలోచించాలి. కలిసికట్టుగా ముందుకు వెళదాం’ అని చెప్పారు.
అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రమణ వంక మాట్లాడుతూ.. ‘ఆర్ట్ విభాగం అనేది ఇండస్ట్రీలో కీలకమైంది. సినిమాలో అన్ని విభాగాల్లోకి సాంకేతికత వస్తోంది. ఆర్ట్ విభాగంలోనూ ఏఐ, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ మొదలైంది. ఈ తరుణంలో టెక్నాలజీ సంస్థలతో మేము కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం.
మా సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి అసోసియే షన్ కృషి చేస్తుంది’ అని తెలిపారు. ప్రధానకార్యదర్శి రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. ‘అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. భేషజాలు లేకుండా అందరికీ సమన్యాయం చేస్తాం’ అని తెలిపారు.