06-02-2025 04:55:17 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న TGSP-15వ బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ సువర్ణపాక లక్ష్మీనర్సు(36) గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. లక్ష్మీనర్సు మృతి పట్ల ఏడుల బయ్యారం పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది దిగ్బ్రాంతిని వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.