దుబాయ్: భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ ఐసీసీ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ సీజన్‌లో భారత్ గెలిచిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ కీలకపాత్ర పోషించాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజం, కంగారూ బ్యాటర్ ట్రావిస్ హెడ్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజాతో అర్ష్‌దీప్ పోటీపడనున్నాడు. ఈ ఏడాదిలో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన సింగ్ 36 వికెట్లు నేల కూల్చాడు. విజేత ఎవరనేది 2025 జనవరిలో ప్రకటించనున్నారు.
రేసులో మంధాన కూడా..
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. ఇక ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు వనిందు హసరంగ (శ్రీలంక), మెండిస్ (శ్రీలంక), ఒమర్జాయ్ (అఫ్ఘనిస్తాన్), రూథర్‌ఫర్డ్ (వెస్టిండీస్) నామినేట్ అయ్యారు. ఐసీసీ మహిళల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఆటపట్టు (శ్రీలంక), కెర్ (న్యూజిలాండ్), ప్రెండెర్‌గాస్ట్ (ఐర్లాండ్), లారా (సౌతాఫ్రికా)నామినేట్ అయ్యారు.