దుబాయ్: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. బంగ్లాతో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లతో మెరిసిన అర్షదీప్ ఎనిమిది స్థానాలు మెరుగుచుకుని 642 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్లలో కేవ లం అర్ష్‌దీప్ మాత్రమే టాప్-10లో కొనసాగుతున్నాడు. 721 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ బౌలర్ రషీద్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.