న్యూఢిల్లీ, నవంబర్ 10: ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లాను కెన డా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 27 తేదీల్లో కెనడాలో జరిగి న కాల్పుల కేసులో అర్ష్‌దల్లాని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అర్ష్ దల్లా అరెస్ట్ గురించిన తమకు సమాచారం అందినట్టు భారత భద్రతా సంస్థలు ధ్రువీకరించాయి. ఇండియాలో పలు నేరాలకు పాల్పడుతున్న 28ఏళ్ల అర్ష్ దల్లా తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడని భారత నిఘా సంస్థలు పేర్కొన్నాయి.
గత కొన్నేళ్లుగా అతడు కెనడా నుంచి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పంజాబ్‌లోని జాగ్రావ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పరమజీత్ సింగ్ హత్యకు అర్ష్ దల్లా బాధ్యత వహించాడు. డేరా సచ్చ సౌ దా అనుచరుడు మనోహర్ లాల్‌ను అతని సహచరుల హత్యలో కూడా అతడికి ప్రమేయం ఉంది. అంతేకాకుండా పంజాబ్‌లో కాంగ్రెస్ నాయ కుడు బల్జీందర్ సింగ్ బల్లిని హత్య చేయించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని భారత్ ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. నిజ్జర్ మరణానంతరం అతడి వారసుడిగా అర్ష్ దీప్ గుర్తింపు పొందాడు.