calender_icon.png 10 October, 2024 | 10:49 AM

అహంకారం.. అతివిశ్వాసం

10-10-2024 01:18:12 AM

  1. హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై విమర్శలు
  2. మిత్రపక్షాల నుంచే దెప్పిపొడుపులు
  3. ఓటమిని ఊహించలేదు: కాంగ్రెస్ నేత రాహుల్
  4. ఢిల్లీ ఎన్నికల్లో హస్తంతో పొత్తు ఉండదు: ఆప్

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: హర్యానాలో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ముప్పేట విమర్శల దాడి ఎదుర్కొంటున్నది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఒకవైపు కాంగ్రెస్‌ను ఏకిపారేస్తుండగా, మొన్నటివరకు భుజంభుజం రాసుకొని తిరిగిన ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కూడా హస్తం పార్టీపైకి తుపాకులు ఎక్కుపెట్టాయి.

శివసేన, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ..  కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించాయి. అహంకారం, అతి విశ్వాసం తోనే కాంగ్రెస్ హర్యానాలో ఓడిందని పేర్కొన్నాయి. చిన్నపార్టీలను పట్టించు కోకుండా ఓటమి మూటగట్టుకొన్నదని విశ్లేషించాయి.  

ఈసీకి సాక్ష్యాలు సమర్పించాం

హర్యానాలో 20 సెగ్మెంట్లలో ఈవీఎం హ్యాకింగ్ జరిగిందని, అందులో 7 స్థానాల్లో డాక్యుమెంటరీ సాక్ష్యాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తెలిపారు. మిగిలిన 13 మందికి సంబంధించిన పత్రాలను రెండు రోజుల్లో సమర్పిస్తామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఎప్పటికీ కాంగ్రెస్‌దే విజయమని, ఈవీఎం దగ్గరికి వచ్చాకే సంఖ్య దిగిపోతోందని ఆరోపించారు.

స్వయంకృతం: శివసేన

మహారాష్ట్రలో భాగస్వామ్య పక్షమైన శివసేన (యూబీటీ) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. సామ్నాలో హర్యానా ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ గెలిచే అవకాశాలు ఉన్నచోట చేజేతులా ఓటమి మూటగట్టుకొంటు న్నది. కింది స్థాయి నాయకత్వంపై హైకమాండ్‌కు నమ్మకం లేకపోవటం, చిన్నపార్టీలను పట్టించుకోకపోవటంతో కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపింది.

పార్టీలోని అంతర్గత వర్గపోరు బీజేపీకి కలిసి వస్తున్నది. గతేడాది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ యువతను నిర్లక్ష్యం చేసి కమల్‌నాథ్, భూపేశ్ భగేల్ మాటలకే ప్రాధాన్యం ఇవ్వటంతో కాంగ్రెస్ బలహీనపడింది. హర్యానాలో భూ పిందర్ హుడా తన తోటి నాయకురాలు కుమారి సెల్జాను బహిరంగంగానే విమర్శిస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని, ఆయనే కాంగ్రెస్ పడవను ముంచేశారనే అనుమానాలు ఉన్నాయని సామ్నా వెల్లడించింది.

లైట్ తీసుకొన్న సమాజ్‌వాదీ పార్టీ

హర్యానాలో ఓటమితోపాటు జమ్ముకశ్మీర్‌లోనూ ఆశించిన స్థాయిలో గెలుపు ను దక్కించుకోకపోవటంతో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్‌ను దాని మిత్రపక్షం సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీ పెద్దగా లెక్కచేయటం లేదు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. చెరో ఐదు చోట్ల పోటీ చేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. పొత్తుపై చర్చలు జరుగుతుండగానే ఆరు స్థానాలకు బుధవారం ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించింది.

అంటే కాంగ్రెస్‌కు నాలుగు సీట్లేన ని చెప్పకనే చెప్పింది. టీఎంసీ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. కచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంటే ప్రాంతీయ పార్టీలకు సీట్లు ఇవ్వమని భావించడం వల్లే ఇలా జరిగిందని టీఎంసీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఓటమిపై బీహార్‌లోని దాని మిత్రపక్షం ఆర్జేడీ కూడా దెప్పి పొడిచింది. రాజకీయ పొత్తులకు సంబంధించిన సూత్రాలను అన్ని పార్టీలు గౌరవించాలని సూచించింది. 

రాహుల్‌కు బీజేపీ జిలేబీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జిలేబీలపై జీఎస్టీని ఆధారంగా చేసుకొని కేం ద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి.. బీజేపీ తిరిగి అవే జిలేబీలతో చురకలు అంటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి పోవటంతో హర్యానా బీజేపీ నేతలు రాహుల్‌గాంధీకి బుధవారం కిలో జిలే బీ పార్సిల్ పంపించారు.

‘హర్యానాలో ని బీజేపీ కార్యకర్తలందరి తరఫున కాం గ్రెస్ నేత రాహుల్‌గాంధీ నివాసానికి కిలో జిలేబీలను పంపాం’ అని బుధవా రం బీజేపీ ట్వీట్ చేసింది. 24, అక్బర్ రోడ్, ఢిల్లీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అడ్రస్‌ను కూడా చేర్చింది.

ఓటమిని విశ్లేషించుకొంటాం

హర్యానాలో గెలుపు తథ్యమని భావి ంచిన చోట ఓటమి పాలు కావటంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పందించా రు. ఈ ఓటమిని ఊహించలేదని, ఇలా ఎందుకు జరిగిందన్న అంశంపై విశ్లేషించుకొంటామని బుధవారం ట్వీట్ చేశా రు. ‘జమ్ముకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు.

ఈ గెలుపు మన రాజ్యాంగం సాధి ంచిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి విజయం. హర్యానాలో ఎదురైన అనూ హ్య పరిణామాలపై విశ్లేషణ చేపట్టాం. చాలా నియోజకవర్గాల నుంచి ఫిర్యాదు లు వస్తున్నాయి. వాటిని ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నాం. హర్యానాలో పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలందరికి ధన్యవాదాలు’ అని రాహుల్ పేర్కొన్నారు.