calender_icon.png 22 September, 2024 | 6:58 AM

28న రాష్ట్రపతి ముర్ము రాక

22-09-2024 12:40:41 AM

ముందస్తు ఏర్పాట్లు చేయాలి

సీఎస్ శాంతికుమారి ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): ఒక రోజు పర్యటనపై ఈ నెల 28వ తేదీన రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాల్లాడుతూ 28న రాష్ట్రపతి ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారని పేర్కొన్నారు. సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలియజేశారు.

బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.  శాఖల మధ్య సమన్వయం చేసుకుని రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. నిరంతర విద్యు త్ సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీ మ్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, స మాచార, పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఆరోగ్యశాఖ కార్యద ర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, జీహెచ్‌ంఎంసీ కమిషనర్ అమ్రపాలి, టీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్,  అధికారులు పాల్గొన్నారు.