calender_icon.png 16 January, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ మునిమనవడి ఆగమనం

10-08-2024 12:05:00 AM

తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత నటుడు జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు నట జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ‘న్యూ టాలెంట్ రోర్స్ ఏ’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డేనున సెలబ్రేట్ చేసుకుంటూ శుక్రవారం మేకర్స్ ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ కథ నేను రాసుకున్నాను. నేను పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్‌గా వెలిగారు. అయితే వాళ్లలో చాలా మంది ముంబై వారే. ఈసారి మన తెలుగమ్మాయిని పరిచయం చేయాలని భావించాం. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. కొత్త ట్యాలెంట్‌నూ ప్రోత్సహిస్తున్నాం’ అని తెలిపారు. సాయిమాధవ్ మాట్లాడుతూ.. ‘బ్యానర్‌లాగానే ప్రతిబింబించే ప్రతిభ గర్జిస్తే ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేస్తా’ అని చెప్పారు.