calender_icon.png 25 January, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా దర్బార్ కు పలువురు మంత్రుల రాక...

24-01-2025 11:47:58 PM

జాతర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర పండుగగా పేరుగాంచిన ఆదివాసీల నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా దర్బార్ హాలులో నిర్వహించిన జాతర సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ అలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా లతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాగోబా మహా జాతర సందర్భంగా 31 తేదీన నిర్వహించే దర్బార్ కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క తో పాటు పలువురు మంత్రులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది కల్ల 15 కోట్ల రూపాయలతో కేస్లాపూర్ రోడ్డు విస్తరణకు కృషి చేస్తామన్నారు. 6 కోట్ల రూపాయలు 3 రోజుల్లో కలెక్టర్ ఖాతాలో జమ అవుతాయన్నారు. కేస్లాపూర్ అభివృద్ధి కోసం 13 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందించామన్నారు. పలు రాష్ట్రల నుండి ప్రజలు వస్తారన్నారు.