calender_icon.png 23 October, 2024 | 5:55 AM

సెప్టెంబర్ 7న లక్కీ భాస్కర్ రాక

10-07-2024 12:05:00 AM

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్‌గా మొదలై అసాధారణ స్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణం ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాల తర్వాత దుల్కర్ కథానాయకుడిగా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమానిను సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

1980 కాలంలో జరిగిన కథగా తెరపై కనపడనున్న ఈ సినిమా కోసం ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ విస్తృతంగా పరిశోధించి, 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో అందంగా సృష్టించారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరచిన ‘శ్రీమతిగారు’ అనే గీతం ఇటీవల విడుదలై సినీ సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ని ర్మించిన ఈ సినిమా తెలు గు, మలయాళం, హిం దీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.