calender_icon.png 4 March, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీల అరెస్టులు సరికాదు

04-03-2025 07:15:59 PM

సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): సమస్యలు విన్నవించేందుకు ప్రజా దర్బార్ కు వెళ్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం సరికాదని సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ఖండించారు. 11 నెలలుగా పెండింగ్లో ఉన్న ఏరియాస్ వేతనాల విడుదల చేయాలని, పెరిగిన వేతనాలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదుకు వెళుతున్న అంగన్వాడి టీచర్లను ఎక్కడికి అక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అన్యాయం అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. అంగన్వాడీలపై నిర్బంధ కాండను ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.