బెటాలియన్ కానిస్టేబుళ్ల సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో పోలీసుల చర్యలు
ప్రభుత్వ తీరుపై కానిస్టేబుళ్ల మండిపాటు
హైదరాబాద్ సిటీబ్యూరో/సిరిసిల్ల, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు సోమవారం సెక్రటేరి యట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బెటాలియన్ కానిస్టేబుళ్లను సెక్రటేరియట్ వైపు రాకుండా ఎక్కడివారిని అక్కడే అరెస్ట్ చేశారు.
ముందుగా వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ రాకుండా అడ్డుకోవడంతో పా టు వచ్చిన వారిని నగర శివార్లలో, సచివాలయం వెళ్లే దారుల్లో అదుపులోకి తీసు కున్నారు. ప్రభుత్వ తీరుపై బెటాలియన్ కానిస్టేబుళ్లు మండిపడ్డారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, డీజీపీ తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఏఆర్ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్ల డిస్మిస్
ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని ఆందోళన చేస్తున్న బెటాలియన్లపై ఆర్టికల్ 311(2)బీ ప్రకారం పోలీస్‌శాఖ వేటువేసింది.దీనిలో భాగంగా సిరిసిల్ల పరిధి 17వ బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సై రామకృష్ణతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, కరుణాకర్‌రెడ్డి, వంశీ, అశోక్, శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.