calender_icon.png 26 October, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్టులపె వారివి డ్రామాలు

26-10-2024 01:18:25 AM

  1. పార్టీ మారిన వాళ్లు వ్యభిచారులైతే, గతంలో వారిని చేర్చుకున్న మీరేమిటి!
  2. కేటీఆర్‌కు లీగల్ నోటీసులు ఇస్తా
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరిన వారిని రాజకీయ వ్యభిచారులని అం టున్న కేటీఆర్, గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ తెలివి ఎటుపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

మీ తండ్రి కేసీఆర్ మొదట ఏ పార్టీలో ఉండి ఇప్పుడు ఏ పార్టీ ని నడుపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మూసీ ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు పద్ధతి తో మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ నేతల భాష, వ్యవహార శైలి చూస్తే అసహ్యమేస్తోందన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు తాను కౌంటర్ ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై తాను మాట్లాడిన అంశాలకు లీగల్ నోటీసు ఇస్తే తాను కూడా ఇస్తానని తెలిపారు. అరె స్టు చేస్తే అంతు చూస్తామం టూ కేటీఆర్ చే సిన వ్యాఖ్యలపై ఆయన స్పం దించారు.

కాం గ్రెస్, బీఆర్‌ఎస్ రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, రెండు రోజుల్లో బాంబు లు పేలుతాయని మంత్రులంటే.. అరెస్ట్ చేస్తే అంతు చూస్తామని బీఆర్‌ఎస్ నేతలంటున్నారని ఇద్దరివీ డ్రామాలేనని తెలిపారు. నువ్వు కొట్టినట్లు చెయ్ నేను దెబ్బతిన్నట్లు నటిస్తా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ అంశంలో బీజేపీ నిర్వహించిన ధర్నా విజయవంతమవ్వడంతో ఓర్వ లేక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలికిట్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.