calender_icon.png 24 December, 2024 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్

22-12-2024 01:57:17 AM

* ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లకు షాక్

* విరాట్ కోహ్లీ పబ్‌కు లేని అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ

* నోటీసులు జారీ

* పీఎఫ్ కేసులో ఉతప్పకు..

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భారత క్రికెటర్లకు ఒకే రోజు బిగ్ షాక్ తగిలింది. ఒకరికి పీఎఫ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కాగా.. మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. 

౨౩ లక్షలకు కుచ్చుటోపీ..

స్టులిష్ షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఉతప్ప.. బెంగళూరు కేంద్రంగా ఉన్న సెంటారస్ లైఫ్ స్టుల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. కంపెనీలో పని చేసే ఉద్యోగులపై కూడా విరుచుకుపడ్డాడు. ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) కోసమని కట్ చేసిన దాదాపు రూ. 23 లక్షలను వారి అకౌంట్లలోకి జమ చేయలేదు. దీంతో పీఎఫ్ రీజనల్ కమిషనర్ అతడికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4వ తేదీనే ఈ నోటీసులతో ఉతప్ప నివాసానికి వెళ్లగా.. వారికి ఉతప్ప ఆచూకీ లభించలేదు. దీంతో పీఎఫ్ అధికారులు స్థానిక పోలీసులను తగిన చర్య లు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. డిసెంబర్ 27లోగా ఉతప్ప పీఎఫ్ బకాయిలు చెల్లించని పక్షంలో అతడి అరెస్ట్ తప్ప దని పోలీసులు జారీ చేసిన వారెంట్‌లో ఉంది. భారత్ తరఫున క్రికెటర్‌గా సేవలందించిన ఉతప్ప 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులో ఇండియా సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఉతప్ప కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నట్లు సమాచారం. 

కోహ్లీ పబ్‌కు నోటీసులు 

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్ 8 కమ్యూన్’ అనే పబ్‌కు బెంగళూరు మహానగర పాలిక అధికారులు నోటీసులు జారీ చేశారు. పబ్ యాజమాన్యం సరైన విధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని వారు ఆరోపించారు. ఇది బెంగళూరులో ఎంజీ రోడ్‌లో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో ఉంది. ఈ పబ్‌కు అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి ఎన్‌ఓసీ లేదని సామాజిక కార్యకర్తలు వెంకటేశ్, నరసింహమూర్తి ఫిర్యాదు చేయగా.. నవంబర్ 29న మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశా రు. పబ్ యాజమాన్యం మాత్రం ఈ నోటీసులపై సైలెంట్‌గాఉంది. నిబందనలు పాటించేందు కు ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో అధికారులు మరోసారి నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా నోటీసులపై స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.    

‘నా మీద పీఎఫ్‌కు సం బంధించిన కే సు నమోదైన ట్లు వార్తల ద్వా రా తెలిసింది. నేను ఇక్కడ ఓ విషయం చెప్పదలుచుకున్నా. నేను ఆ కంపెనీలకు రుణాలు ఇచ్చిన వ్యక్తిగా.. అప్పట్లో డైరెక్టర్‌గా అపాయింట్ అయింది నిజమే కానీ.. ప్రస్తుతం ఆ విధుల్లో లేను. నేను రుణాలు ఇచ్చిన ఏ కంపెనీకి ప్రస్తుతం డైరెక్టర్‌గా లేను’ రాబిన్ ఉతప్ప