calender_icon.png 14 February, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటక నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

13-02-2025 10:56:30 PM

పరిగి (విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల నుంచి హైదరాబాదుకు గంజాయిని కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉండే నాడేపల్లి తండాకు చెందిన చౌహన్ శ్రీనివాస్ తన వ్యవసాయ పొలంలో పండించి ఎండిన తర్వాత హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు తరచూ వచ్చి చౌహాన్ శ్రీనివాస్ దగ్గర గంజాయిని తీసుకుపోయేవారు.

వారు రాణి సమయంలో చౌహాన్ శ్రీనివాస్ మరో వ్యక్తి ఇద్దరు కలిసి స్పెండర్ ప్లస్ బైక్ పై అర్థరాత్రి సమయంలో తీసుకుపోయి ఇచ్చేవారు. అందులో భాగంగానే గురువారం రోజు చోహన్ శ్రీనివాస్ పరి ఈ సమీపంలోకి రాగానే రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ కిరణ్ వారి సిబ్బంది ప్లాన్ ప్రకారం వారిని పట్టుకుని వారి దగ్గర నుంచి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని. గంజాయిని అమ్మిన వారిపై కొన్న వారిపై  చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందని కిరణ్ తెలిపారు.