calender_icon.png 3 March, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌జెండర్ల అరెస్టు

02-03-2025 11:10:19 PM

కాలనీలో అసభ్యకర ప్రవర్తన..

నిందితుల్లో అత్యధికులు పశ్చిమబెంగాల్‌కు చెందినవారు..

10 మందిని అరెస్టు చేసిన సరూర్‌నగర్ పోలీసులు.. 

ఎల్బీనగర్: కాలనీలో తిరుగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరూర్‌నగర్ చెరువు కట్ట కింది కల్లు దుకాణం, పీ అండ్ టీ కాలనీలో రాత్రివేళలో ట్రాన్స్‌జెండర్లు తాము ఉంటున్న ప్రాంతాన్ని రెడ్‌లైట్ ఏరియాగా మార్చి, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. సరూర్‌నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్‌వోటీ సీఐ వెంకటయ్య, ఏహెచ్‌టీయూ సీఐ దేవేందర్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందాలు సరూర్‌నగర్ చెరువు కట్ట కింది కాలనీ, పీ అండ్ టీ కాలనీల్లో ట్రాన్స్‌జెండర్లు నివాసం ఉంటున్న ఇండ్లపై దాడి, 10 మందిని అరెస్టు చేశారు.

పట్టుపబడిన ట్రాన్స్‌జెండర్లలో అత్యధికులు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారనే విషయాలపై విచారణ చేపట్టారు. అరెస్టు చేసినవారిలో పోల్లోజు సింధు(32) (మిర్యాలగూడ నల్లగొండ జిల్లా), తియాస్ జయదేవ్‌పాల్(20), జుల్లి శంకర్(27), సోనాబివాల్ (31), బుటియ్(27), దియా శంకర్(27), అమృత బెయిల్(26), పుణ్య బైరాగ్య(33), నూన్ మహ్మద్(42) వీరిందరిదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. కాగా, పోలీసులు వీరి ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరిని సరూర్‌నగర్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తామని సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.